ఆ ముగ్గురు ఎంపీలు ఎందుకు సైలెంటయ్యారు…?

-

కొత్త అధ్యక్షుడి రాకతో ఆ ముగ్గురు ఎంపీలు సైలెంటయ్యారా.. కీలక సమయంలో ఎందుకు కనుమరుగయ్యారు. ఏపీ బీజేపీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరంతా టీడీపీ నుంచి వచ్చిన వారే. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిన తర్వాత కమలం గూటికి చేరిపోయారు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌. చేరిన కొత్తలో బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న వీరంతా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు.. చర్యలపై తీవ్ర అభ్యంతరాలు తెలియజేసిన సుజనా చౌదరి ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఈ ముగ్గురు ఎంపీలలో టీజీ వెంకటేశ్‌ కొన్ని బీజేపీ సమావేశాలకు అప్పుడప్పుడూ వచ్చేవారు. సుజనా, సీఎం రమేష్‌ మాత్రం మీటింగ్స్‌కు రెగ్యులర్‌గా హాజరయ్యేవారు. అమరావతి ఉద్యమంలో సుజనా స్వయంగా పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటనలు కూడా చేశారు. డిల్లీలో సైతం పార్టీ పెద్దలను కలిసి అమరావతి విషయంలో రాష్ట్ర సర్కార్‌ తీసుకునే నిర్ణయాలపై కంప్లయింట్స్‌ చేసేవారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు.

ఏపీలో బీజేపీ విధానాలపై కేంద్ర నాయకత్వం ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత అక్కడ వేలు పెట్టడం అనవసరం అన్న నిర్ణయానికి ఈ ముగ్గురు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు యాక్టివ్‌ అయ్యారు. వీర్రాజు వచ్చిన తర్వాత జీవీఎల్‌ పరిధి మరింత పెరిగింది. రాష్ట్ర కమిటీ కూర్పులో తన వంతు పాత్ర పోషించారట జీవీఎల్‌. ఇలాంటి అనేక అంశాలు సుజనా, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌లు సైలెంట్‌ అవడానికి కారణమని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news