జింక్ మహిళలకి ఎంత ముఖ్యమో తెలుసా..? వామ్మో ఇన్ని సమస్యలు వస్తాయా..?

-

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. పోషకాహార లోపం కలిగితే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే అనవసరంగా ఇబ్బందులు బారిన పడాల్సి ఉంటుంది ఐరన్ మెగ్నీషియం జింక్ ఇవన్నీ కూడా మనం డైట్ లో తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా జింక్ లోపం కలగకుండా చూసుకోవాలి. మహిళలకి జింక్ చాలా ముఖ్యమైనది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు జింక్ మానసిక ఆరోగ్యానికి కూడా అవసరం.

జింక్ లోపం వలన రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జింక్ లోపం కలిగితే మహిళల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… జింక్ లోపం కనుక మహిళల్లో కలిగితే రీప్రొడక్టివ్ హెల్త్ దెబ్బతింటుంది మంచి రిప్రొడక్టివ్ ఆరోగ్యం కోసం కచ్చితంగా జింక్ డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి చర్మానికి కూడా జింక్ చాలా అవసరం అందుకనే డైట్ లో కచ్చితంగా జింక్ తీసుకుంటూ ఉండాలి.

చర్మ సమస్యలు జింక్ లోపం వలన కలుగుతాయి స్కిన్ ని కాపాడుకోవడానికి కచ్చితంగా జింక్ ఉండేటట్టు చూసుకోండి జింక్ లోపం ఉంటే యాక్ని మొదలైన సమస్యలు కలుగుతాయి జింక్ ని తీసుకోవడం వలన రోగినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బ్యాక్తీరియా వైరస్ల బారిన పడకుండా ఉండొచ్చు. బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా జింక్ చాలా అవసరం జింక్ ని తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జింక్ లోపం ఉన్నట్లయితే ఎముకలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే జింక్ ని కచ్చితంగా డైట్ లో చేర్చుకోండి ఫ్రాక్చర్స్ ఆస్ట్రోపోరోసిస్ వంటి సమస్యలు కూడా రావు.

లేకపోతే ఈ ఇబ్బందులు కూడా కలుగుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా జింక్ అవసరం జింక్ లోపం వలన హృదయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. హృదయ ఆరోగ్యం బాగుండాలంటే కూడా జింక్ ఉండే ఆహార పదార్థాలు కచ్చితంగా తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షణను ఇస్తాయి. క్యాన్సర్ బారిన పడకుండా చూసుకుంటాయి చూశారు కదా జింక్ ఎంత ముఖ్యమో కాబట్టి జింక్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు డైట్లో చేర్చుకోవడం అస్సలు మర్చిపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news