కండోమ్ వాడటం ఎలాగో చెప్తున్న నటి..ట్రోలింగ్‌కు భయపడబోనని వివరణ

-

బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా..డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది. ఏదేని విషయమై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని బహిరంగంగానే చెప్తుంది నుష్రత్ బరుచా. నుష్రత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జన్ హిత్ మే జారీ’. ప్రజెంట్ ఈ నటి ఈ పిక్చర్ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమెకు నెగెటివ్ కామెంట్స్ ఎదురవుతుండగా, వాటికి తనదైన శైలిలో సమాధానాలిస్తోంది.

‘జన్ హిత్ మే జారీ’ పిక్చర్ ట్రైలర్ రిలీజ్ కూడా అయింది. అయితే, ఈ సినిమా స్టోరిలో భాగంగా నటి నుష్రత్ బరుచా కండోమ్ లను ప్రమోట్ చేసే వ్యక్తిగా కనబడుతుంది. స్టోరి లైన్ కూడా కండోమ్ ప్రమోషన్ మీదనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు నుష్రత్ బరుచాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆ కామెంట్స్ కు తను భయపడబోనని, ఇటువంటి టాపిక్ పై సినిమా తీయడానికి ధైర్యం కావాలని అది తనకు ఉందని స్పష్టం చేసింది.

‘జన్ హిత్ మే జారీ’ పిక్చర్ ఈ ఏడాది జూలై 10న విడుదల కానుంది. డెఫినెట్ గా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో జనాలను ఎడ్యుకేట్ చేసే విధంగా మూవీ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.ఈ నెల 6న సినిమా ట్రైలర్ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

https://www.instagram.com/p/CdKpoaIjzgy/?utm_source=ig_embed&ig_rid=b2155039-b55e-4f5a-810d-03288e5eff61

https://www.instagram.com/p/CdIdne0p87X/?utm_source=ig_embed&ig_rid=6b8ab5da-927f-42b0-9bb4-18107faa3e86

Read more RELATED
Recommended to you

Latest news