కొత్త డౌట్: అచ్చెన్నా – చంద్రబాబు “ప్రైవేటు”గా కలుసుకోవచ్చా?

-

ఈఎస్ఐ స్కాంలో అరెస్టయ్యి జైల్లో ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంటానని అచ్చెన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టు తాజాగా స్పందిస్తూ.. అచ్చెన్నకు ఆ అవకాశం కల్పించింది. దీంతో కొత్త విషయం తెరపైకి వస్తోంది!

అచ్చెన్నాయుడు అరెస్టయి, గుంటూరు ప్రభుత్వ హాస్పటల్ లో చేర్చిన అనంతరం చంద్రబాబు – లోకేష్ లు కలవడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా పేరు చెప్పిన పోలీసులు అనుమతి నిరాకరించారు. జైళ్ల శాఖ సూపరిండేంట్ ను సంప్రదించినా కూడా.. “కరోనా వేల ములాఖత్ ఏలా” అని అటువైపునుంచి సమాధానం వచ్చింది. దీంతో మైకులముందు కాస్త హడావిడి చేసి బాబులిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

అయితే… ప్రస్తుతం అచ్చెన్నాయుడిని చంద్రబాబు కలవకపోవడమే మంచిదని పోలీసులు అధికారులు, ప్రభుత్వం భావించిందని.. దాని ఫలితమే ఇది అని అప్పట్లో వార్తలొచ్చాయి. అవన్నీ అంటే పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులు, జైళ్లు కాబట్టి కుదరలేదు కానీ… ఇప్పుడు కోర్టు తాజా తీర్పుతో అచ్చెన్నాయుడు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లనున్నారు కాబట్టి.. బాబు వెళ్లి అచ్చెన్నను కలిసే అవకాశాలుంటాయా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

అచ్చెన్న బయటకు వస్తే.. సాక్ష్యులను ప్రభావింతం చేస్తారని ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో… అచ్చెన్న బయటకు వస్తే ఎంత ప్రమాదమో.. బాబు లోపలికి వెళ్లి అచ్చెన్నను కలిసినా అంతే ప్రమాధం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అచ్చెన్న చేరబోయ్యేది పేరుకు ప్రైవేటు ఆసుపత్రి అయినా కూడా… అచ్చెన్న అడ్మిట్ అయిన అనంతరం అది పూర్తిగా పోలీసుల గ్రిప్ లోకి వెళ్లిపోతుందని, కాబట్టి… ఇప్పుడు కూడా బాబుకు అనుమతులు దొరకకపోవచ్చని అంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news