ఇండియాలో కరోనా వైద్యం మారుతుందా…?

-

కరోనా వైరస్ చికిత్స కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రోటోకాల్‌ ను సమీక్షించాలని భారత ఆరోగ్య అధికారులు నిర్ణయించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నిర్వహించిన కొన్ని ట్రయల్స్ లో కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న నాలుగు రకాల మందులు కరోనా రోగుల మరణాలను తగ్గించడం లేదా, వ్యాధి చికిత్సలో ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వడం లేదని గుర్తించారు.

వీటిలో యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్, మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ), లోపినావిర్ మరియు రిటోనావిర్ యొక్క హెచ్‌ఐవికి వాడే మందులు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, తదుపరి ఉమ్మడి టాస్క్‌ ఫోర్స్ సమావేశంలో ప్రోటోకాల్ ను సమీక్షిస్తామని చెప్పారు. ఆరోగ్య శాఖ నుంచి, నీతి ఆయోగ్, మరియు డైరెక్టర్ జనరల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసిఎంఆర్), డాక్టర్ బలరామ్ భార్గవ ఈ సమీక్షలో పాల్గొంటారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news