కాపు రిజర్వేషన్లపై జగన్ ట్విస్ట్ ఇస్తారా?

-

అగ్రవర్గాల్లో కూడా పేదలు ఉన్నారనే సంగతి తెలిసిందే..వారు ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గత 2019 ఎన్నికల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం..అగ్రవర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఈ రిజర్వేషన్లని ఒకో రాష్ట్రం ఒకోలా అమలు చేసుకున్నాయి. ఇదే క్రమంలో అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు..10 శాతంలో 5 శాతం కాపులకు కేటాయించి…మిగిలిన 5 శాతం మిగతా వర్గాలకు కేటాయించారు.

రాష్ట్రంలో కాపులు అత్యధికంగా ఉన్నారు..అందుకే కాపులకు 5 శాతం కేటాయించారు. పైగా ఎన్నో ఏళ్ల నుంచి తమని బీసీల్లో చేర్చాలని కాపులు పోరాటం చేస్తున్నారు. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చాక..కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి..అసెంబ్లీలో ఆమోదించి..కేంద్రానికి పంపారు. కానీ అక్కడ ఆమోదం రాలేదు. ఈలోపు కేంద్రం అగ్రవర్గాలకు 10 శాతం ఇవ్వడంతో..అందులోనే 5 శాతం కాపులకు ఇచ్చారు.

అయితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్..కాపు రిజర్వేషన్లు సాధ్యపడదని చెప్పి..బీసీల ఓట్లపై కన్నేసి సక్సెస్ అయ్యారు. పైగా ఈ 10 శాతం రిజర్వేషన్లపై కోర్టులో కేసు పడింది. ఈ 10 శాతం ఇస్తే..ఓవరాల్ గా 50 శాతం రిజర్వేషన్లు దాటేస్తాయని కొందరు వ్యక్తులు పిటిషన్ వేశారు.  దీంతో అధికారంలోకి వచ్చాక ఈ రిజర్వేషన్ల ఊసు జగన్ తీయలేదు. కానీ తాజాగా 50 శాతం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా.. అగ్రవర్గాల 10 శాతం రిజర్వేషన్లని కోర్టు సమర్ధించింది.

దీంతో దీనిపై జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికగా మారింది. ఈ 10 శాతంలో 5 శాతం కాపులకు కేటాయిస్తారా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే పవన్‌తో కాపు ఓట్లు వైసీపీకి దూరం అవుతాయి. ఆ కాపులని మళ్ళీ దగ్గర చేసుకోవాలంటే 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మరి జగన్ ఆ పనిచేస్తారా? లేదా? అనేది చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news