ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. చంద్రబాబుని వదిలేసి జనాలను, జగన్ ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు! అనంతరం సీనియారిటీ మాటున బాబుకు జై కొట్టడం స్టార్ట్ చేశాడు! ఫలితంగా 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాడు! మరి బాబుకు అంతలా ఉపయోగపడిన పవన్.. ఇప్పుడు బీజేపీకి ఉపయోగపడతారా అన్నది తేలిపోయే సమయం ఆసన్నమైంది!
అవును… చంద్రబాబుకి ఎంతో ఉపయోగపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు పొత్తులో ఉన్న బీజేపీకి ఉపయోగపడతాడా లేదా అన్నది తేల్చడానికన్నట్లుగా రెడీ గా ఉంది తిరుపతి ఎంపీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక! అవును… ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీచేస్తుందా లేదా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే.. బీజేపీ మాత్రం కచ్చితంగా పోటీకి నిలబడనుంది!
ఈ సమయంలో తిరుపతిలో బీజేపీ – జనసేనలు కలిసి రంగంలోకి దిగబోతున్నాయి. అయితే ఈ ప్రాంతంలో బీజేపీ కంటే జనసేనకే కాస్తో కూస్తో బలం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు! అదే నిజమైతే దానికి బీజేపీ కేడర్ కూడా కలిస్తే కచ్చితంగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో వీరి కలయిక ప్రభవం చూపించాలి! అదే జరిగితే రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ, అనంతరం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరు కలిసి ఉండే అవకాశాలున్నాయి!
అలా కాకుండా.. ఈ ఎన్నికలో జనసేన వల్ల బీజేపీకి ఏమీ ఓరగని పక్షంలో.. వీరి బంధానికి బీటలు వారే ప్రమాధం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు! మరి బీజేపీతోనే కొనసాగాలని పవన్ మనసావాచా బలంగా నమ్మితే.. ఈ ఉప ఎన్నికను అత్యంత సీరియస్ గా తీసుకుని ప్రచారం చేస్తారు.. అలా కానిపక్షంలో బీజేపీతో చేస్తున్నది బలవంతపు కాపురం అని ఫిక్సయితే మాత్రం లైట్ తీసుకుంటారని అంటున్నారు! సో.. తిరుపతి ఎంపీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికే.. బీజేపీ – జనసేనల మైత్రి ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుందన్నమాట!!