సమంత శాకుంతలం కోసం అయినా బయటకు వస్తుందా..!!

-

సమంత గత సినిమా యశోద సింగిల్ హ్యాండ్ గానే విజయం సాధించింది. వాస్తవానికి ఆ సినిమా వసూళ్లు ఒక మీడియం రేంజ్ హీరోలకు సమానంగా ఉంటాయి. సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటనకు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే కొద్దిరోజులుగా సమంత ఎక్కువుగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఒప్పుకుంటున్నారు.

డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న  శాకుంతలం సినిమా లో సమంత పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. కాని ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మరోసారి  శాకుంతలం చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్టేడ్ షేర్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సమంతతోపాటు.. దేవ్ మోహన్ కూడా ఉన్నారు. ఈ సినిమా ను గుణ టీమ్ వర్క్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆలస్యం అవడానికి కారణం  3డీ వెర్షన్ కోసం అని  తెలుస్తోంది.ప్రస్తుతం  మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్  రెస్ట్ లో వుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ తో పాటు విజయ్ దేవర కొండ తో చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేయవలసి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news