ఈ రోజు ఏం జరుగుతుందా అని తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేటితో రాష్ట్రంలో కర్ఫ్యూ ముగియడంతో.. మళ్లీ కొనసాగిస్తరా.. లేక వీకెండ్ లాక్ డౌన్ పెడ్తరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎలాగూ మే3వరకు లాక్ డౌన్ పెట్టరని తెలిసిపోయింది. దీనిపై నిన్న ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా మరోసారి క్లారిటీ ఇచ్చిండు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదని చెప్పిండు. కానీ కర్ఫ్యూ ఉంటదా లేక వీకెండ్ లాక్ డౌన్ పెడ్తరా అనే దానిపై ఏం చెప్పలేదు.
అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రగతిభవన్ నుంచి ఇప్పటికే చాలా లీకులు వచ్చాయి. మే3వరకు కర్ఫ్యూ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత వీకెండ్ లాక్ డౌన్ లేదా కంప్లీట్ లాక్ డౌన్ పెట్టేందుకు అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఈ రోజు హై కోర్టులో నివేదిక సమర్పించనుంది కేసీఆర్ ప్రభుత్వం.
ఈ రోజు రాష్ట్రంలో మినీ పురపోరు జరగుతోంది. దీని రిజల్ట్ మే3న వస్తాయి. ఇటు నాగార్జున సాగర్, అటు మినీ పురపోరులో టీఆర్ ఎస్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. వాటి ఫలితాల తర్వాతే లాక్ డౌన్ అంశంలోకి వెళ్లాలని టీఆర్ఎస్ చూస్తోంది. ఏది ఏమైనా ఈ రోజు రాత్రి లోపు కర్ఫ్యూపై క్లారిటీ వస్తుంది.