కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారని అన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. భూములు అమ్మి ఖర్చు పెడితే దానికి రాష్ట్రం అవుతుందా?.. మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా? అంటూ ప్రశ్నించారు. బాగానే ఉన్నా సచివాలయంను వాస్తు కోసం కూలగొట్టారు.. ఇతర సీఎం ల పేర్లు ఉన్న శిలాఫలకాలు ఉండదని భావించి.. పూర్వం చక్రవర్తులు చేసిన పని ఇవాళ కెసిఆర్ చేస్తున్నారని అన్నారు ఈటెల.
రాహుల్ గాంధీ వి ఆచరణయోగ్యం కాని హామీలు అని దుయ్యబట్టారు. రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే రూ. 40 వేల కోట్లు కావాలన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ నేటికి నెరవేర్చలేదని ఈటెల చెప్పారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే కేసీఆర్.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా?.. అని మండిపడ్డారు.