కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం విషయంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి…గన్నవరం సీటు విషయంలో వైసీపీలో విభేదాలు మొదలయ్యాయి..ఈ విభేదాల వల్ల గన్నవరంలో వైసీపీ మరింత దెబ్బతినేలా ఉంది. అయితే గన్నవరంలో ఈ పరిస్తితి రావడానికి కారణం..వల్లభనేని వంశీ అని కొందరు వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో వంశీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే..అలాగే ఆయన టీడీపీలో ఉండగా, గన్నవరం వైసీపీ శ్రేణులకు చుక్కలు చూపించారు…ఇక గత ఎన్నికల్లో గెలిచాక వంశీ టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చేశారు.
అక్కడ నుంచే రచ్చ మొదలైంది…వంశీకి ఎలాగో జగన్‌తో కొడాలి నానితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి..అందుకే ఆయన వైసీపీ వైపుకు రాగలిగారు. వైసీపీలోకి వచ్చాక…అసలైన వైసీపీ శ్రేణులు, నేతలు వంశీని రాకని వ్యతిరేకించడం మొదలుపెట్టారు..ఇప్పటికే పలు సందర్భాల్లో వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావు అన్నట్లు వార్ జరిగింది..అలాగే వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య రచ్చ జరిగింది..పైగా వైసీపీ వైపు వచ్చాక వంశీ..తన అనుచరులకు, టీడీపీ వారికే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారని, పదవులు ఇచ్చుకుంటున్నారని, అలాగే నిజమైన వైసీపీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి.
దుట్టా, యార్లగడ్డ వర్గాలకు వంశీ చుక్కలు చూపిస్తున్నారు…ఇదే ఇప్పుడు గన్నవరంలో పెద్ద రచ్చకు కారణమైంది..తాజాగా గన్నవరంకు చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు విజయసాయిరెడ్డిని కలిసి…త్వరగా ఇంచార్జ్‌ని పెట్టాలని కోరారు..గతంలో వైసీపీ ఓటమి కోసం పనిచేసి టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ, తమను ఇబ్బందిపెడుతున్నారని వారు, విజయసాయి వద్ద వాపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ వంశీకి ఇవ్వొద్దని, యార్లగడ్డ వెంకట్రావ్‌కే ఇవ్వాలని విజయసాయిని కోరారు. కార్యకర్తలను కలుపుకుపోతానని వైసీపీలోకి వచ్చిన వంశీ, తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది..మరి ఈ విషయంపై జగన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి..ఎలాగో కొడాలి సపోర్ట్ ఉంది కాబట్టి వంశీకే గన్నవరం సీటు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు..అదే జరిగితే నిజమైన వైసీపీ కార్యకర్తలు వంశీ గెలుపుకు కృషి చేస్తారో లేదో చూడాలి