ఆంధ్ర ప్రదేశ్ రాజధానులపై రాష్ట్ర మంత్రి బొత్స సత్య నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడుతామని మంత్రి బొత్స సత్య నారాయణ స్పష్టం చేశారు. మూడు రాజధానులు అనేవి తమ పార్టీ విధానం అని అన్నారు. అలాగే తమ ప్రభుత్వ నిర్ణయం స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రికరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరో సారి తెల్చి చెప్పారు. మంచి సమయం చూసి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడుతామని అన్నారు.
కాగ మంత్రి బొత్స సత్య నారాయణ.. ఇప్పటికే పలు మార్లు మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పని సరిగా మూడు రాజధానులను తమ ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. ఒకే రాజధాని వల్ల అభివృద్ది ఒకే చోట జరుగుతుందని అన్నారు. కానీ మూడు రాజధానులు ఉండటం వల్ల అభివృద్ధి వికేంద్రికరణ అయి.. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
కాగ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రాజధానులపై హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజధానుల విషయంలో శాసన సభలు జోక్యం చేసుకోరాదని తెలిపింది. అలాగే కేంద్రం కూడా ఇటీవల బడ్జెట్ సమావేశాల సమయంలో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించింది.