మందుబాబులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. నేడు హైదరాబాద్ మహా నగరంలో మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. నేడు హనుమాన్ జయంతి ఉన్న నేపథ్యంలోనే.. హైదరాబాద్ మహా నగరంలో.. మద్యం షాపులను బంద్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు అంటే.. ఏప్రిల్ 17 వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆనంద్ అధికారిక ప్రకటన చేసి.. ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా..ఇవాళ హనుమాన్ జయంతి శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ పోలీసులు.
గౌలిగూడ రాంమందిర్ నుండి తాడ్ బన్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగనుంది శోభాయాత్ర. ఉదయం 11 గంటల నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. గౌలిగూడ, సుల్తాన్ బజార్, నారాయణగూడ, సికింద్రాబాద్ మీదుగా తాడ్ బన్ వరకు కొనసాగనుంది యాత్ర. శోభాయాత్ర సాగె ప్రాంతాల్లో ట్రాఫిక్ రాకపోకలు నిషేధం ఉండనుంది.