చలికాలం వచ్చేసింది.. ఈ చిట్కాలు పాటించండి..!

-

చలికాలం వచ్చేసింది. చర్మంపై ఇప్పుడు మరింత శ్రద్ధ అవసరం. పొడిగాలితో తేమ తగ్గడం వల్ల చర్మం చిరాకుగా అనిపిస్తుంది. పొడిబారినట్లు అవుతుంది. మరి చర్మంపై సహజ తేమను నిలుపుకోవాలంటే.. చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

winter
winter

వేడినీటితో స్నానం మరీ మంచిది కాదు..
చలికాలంలో చన్నీళ్లకంటే వేడినీటితోనే స్నానం చేయాలనుకుంటాం.. కానీ ఎక్కువసేపు వేడినీటితో స్నానం చర్మానికి అంత మంచిది కాదండోయ్. దీని వల్ల చర్మం పొడిబారిపోతుంది. ఫలితంగా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.

లోషన్లు వాడండి..
శీతాకాలంలో చర్మంపై సహజ తేమ ఎక్కువ సమయం నిలవదు. స్నానం చేసిన తర్వాత చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. దానికి లోషన్లు వాడొచ్చు. ముఖానికి క్రీమ్‌ లేదా లేపనాలను ఉపయోగించొచ్చు. చేతులు, కాళ్లను శుభ్రపరుచుకున్న తర్వాత క్రీమ్‌ రాయడం ద్వారా తేమతో మృదువైన చర్మం మీదవుతుంది. ఇక ముఖ్యంగా పెదాలకు లిప్‌బామ్‌ రాయడం ద్వారా పెదాలు పగలవు.

సబ్బు తక్కువగా వాడండి..
చర్మాన్ని సంరక్షించుకోవడంలో మనం వాడే సబ్బు ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. దీంతో చర్మం పొడిబారి దురద రావచ్చు. దీనికి బదులుగా సువాసన లేని జెల్‌తో ముఖాన్ని కడగడం మంచిది. ఈ కాలంలో వీలైనంత వరకూ సబ్బును తక్కువగా ఉపయోగించుకోవడమే ఉత్తమం. ఈ కాలంలోనూ సన్‌స్క్రీన్‌లు తప్పక వినియోగించాలి. దీంతో సూర్యుని ద్వారా వచ్చే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

దాహంలేదని నీళ్ల తాగటం మానకండి!
మీ చర్మం ఎక్కువగా పొడిబారితున్నట్లయితే ఒమేగా-3 లేదా ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోండి. చేప నూనెలో ఈ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. ఇక చలికాలంలో ఎక్కువ దాహంగా అనిపించదు. కానీ ఏ కాలంలో అయినా శరీరానికి అవసరమైన నీటిని తప్పక తీసుకోవాలి.

ఉన్ని దుస్తులు డైరెక్ట్ గా వేసుకోవద్దు..
చలికాలంలో మనం వేసుకునే దుస్తులూ ముఖ్యమే. ఉన్ని వంటి కఠినమైన దుస్తులు మీ చర్మానికి నేరుగా తాకటం వల్ల పొడిచర్మం, చిరాకు, దురద కలగొచ్చు. దీనికి బదులుగా సింపుల్‌, సౌకర్యవంతమైన టీ షర్ట్ లేదా షర్ట్‌‌లను ధరించి వాటిపై స్వెటర్‌ లేదా జర్కిన్లను ప్రయత్నించొచ్చు. తడి దుస్తులు, బూట్లు మీ చర్మానికి చిరాకు, పక్కన ఉన్న వారికి దుర్వాసన ఇస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news