ఇంకొన్ని గంటలే… దూసుకుపోతున్న అభ్యర్థులు..?

-

ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ ప్రచారానికి కొంత సమయం మాత్రమే ఉండడంతో ప్రస్తుతం ప్రచార రంగంలో వివిధ పార్టీల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ దూసుకుపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేపు సాయంత్రంతో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది అనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మిగిలి ఉన్న కొంత సమయాన్ని కూడా ప్రచారం కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రస్తుతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ప్రచారం చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా ప్రచార హోరు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news