కేసీఆర్ టార్గెట్ ఫిక్స్..రివర్స్ స్ట్రాటజీతో కమలం?

-

కేసీఆర్ ఎప్పుడు ఏ విధంగా రాజకీయం నడుపుతారో ఎవరికి క్లారిటీ ఉండదనే చెప్పాలి..ఆయన రాజకీయ వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అయితే ఆయన వ్యూహాలు కనుక్కోవడం అంత సులువు కాదు..పైకి ఏదో ప్రజా ప్రయోజనాలు అన్నట్లు మాట్లాడతారు గాని..లోపల మాత్రం రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి. గత కొంతకాలం నుంచి కేసీఆర్…కేవలం బీజేపీనే టార్గెట్ చేసి ముందుకెళుతున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి..కేవలం బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు..కేసీఆర్ ఇలా చేయడానికి కారణాలు కూడా లేకపోలేదు..తెలంగాణలో ఇప్పుడుప్పుడే బీజేపీ పుంజుకుంటుంది…అలాగే ఉపఎన్నికల్లో గెలిచింది…కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తే..ఆ పార్టీ ఇంకాస్త పుంజుకునే ఛాన్స్ ఉంది..దీంతో కాంగ్రెస్ బలం తగ్గుతుంది..అలాగే రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి తమకు లబ్ది చేకూరుతుందనేది కేసీఆర్ స్కెచ్. అలాగే ఆయన…దేశ రాజకీయాలపై కూడా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు..ప్రజలకు మంచి పాలన అందించడంలో కేంద్రం విఫలమైందనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.

ప్రతి దానికి కేంద్రాన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల సభని సైతం…కేంద్రాన్ని తిట్టడం కోసమే ఉపయోగించుకున్నారు. అంటే బీజేపీని విలన్ గా చేసి చూపించి..మళ్ళీ ఎన్నికల్లో లబ్ది పొందాలనే కాన్సెప్ట్ కనిపిస్తోంది. అయితే కేసీఆర్ వ్యూహాలకు చెక్ పెట్టాలని కమలనాథులు కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు…కేంద్ర ప్రభుత్వం..తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు.

అలాగే కేంద్ర పెద్దలు సైతం తెలంగాణపై ఫుల్ గా ఫోకస్ పెట్టారు..ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలు తెలంగాణకు వస్తూ..కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతూనే ఉన్నారు…ఇక కేసీఆర్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వచ్చే నెలలో మోడీ, కేంద్ర మంత్రులు, అలాగే 18 రాష్ట్రాలకు చెందిన బీజేపీ సీఎంలు తెలంగాణకు రానున్నారు..రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండి, బీజేపీ బలోపేతంపై ఫోకస్ చేయనున్నారు..అంటే కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేసి చెక్ పెట్టడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news