అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి లేరా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఆయన కుటుంబానికి ఉన్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ కూడా నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. చిరంజీవి,అల్లు అరవింద్ ఇద్దరూ కూడా బావ బామ్మర్దులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి హీరోగా ఎదగడం వెనక అల్లు అరవింద్ పాత్ర అత్యంత కీలకమైనదని ఎంతోమంది నటీనటుల సైతం తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు చంద్రమోహన్ చిరంజీవి,అల్లు అరవింద్ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

చంద్రమోహన్ మాట్లాడుతూ.. చిరంజీవిని అల్లు అరవింద్ మహాభారతంలో అర్జునుడు, శ్రీకృష్ణుడు లాగా పోలుస్తూ.. అర్జునుడిని శ్రీకృష్ణుడు ఎలా అయితే గైడ్ చేసేవారో.. అలాగే అల్లు అరవింద్ కూడా చిరంజీవిని చేసేవారని తెలియజేశారు. చిరంజీవి వెనుక నుండి అల్లు అరవింద్ నడిపించే వాళ్ళని తెలియజేశారు. అంతేకాకుండా అల్లు అరవింద్ ఒక గైడ్ గా లేకపోతే చిరంజీవి నథింగ్ అని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి ఎలాంటి చిత్రాలలో నటించాలి ఎంత రెమ్యూనరేషన్ తీసుకోవాలి అనే విషయాలలో కూడా ప్రతిదీ అల్లు అరవింద్ నిర్ణయమే తీసుకునే వారట.

అందుచేతనే ప్రస్తుతం చిరంజీవి ఈ స్థాయిలో కచ్చితంగా ఉన్నారు అంటే అది అల్లు అరవింద్ ప్లానింగ్ కి అంటూ తెలియజేశారు చంద్రమోహన్. ప్రస్తుతం చంద్రమోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో చిరంజీవికి సంబంధించి ప్రతి విషయంలో కూడా అల్లు అరవింద్ తోడుగానే ఉండేవారు కానీ ఈమధ్య కొన్ని కారణాల చేత దూరమయ్యారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ వార్తలపై మెగా కాంపౌండ్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news