పక్కింటి వారితో గొడవ… మహిళ కాల్చివేత

-

ఓ మహిళను ఆమె పొరుగువారే కాల్చి చంపిన ఘటన రాజధానైనా ముంబయిలోని మన్ ఖుర్ద్ లో శనివారం సాయంత్రం ఓ మహిళను ఆమె పొరుగువారే కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందిరా నగర్ ప్రాంతంలో మహిళకు, ఆమె పొరుగింటి వారికి ఏదో అంశంపై గొడవ జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో సదరు మహిళను కాల్చి చంపారు. గొడవకు దిగిన పక్కింటి మహిళ భర్త, ఆమె కొడుకు సంఘటన స్థలానికి చేరుకొని ఒక రౌండ్ కాల్పులు జరిపారని, బాధితురాలి ఛాతీకి గాయమైందని తెలిపారు.

Murder under Indian Penal Code: All you need to know about it

వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లగా, మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే లోపు ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, తన కూతురుపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ మృతురాలు ఇటీవల నిందితుడి సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను కాల్చిన తర్వాత నిందితుడు, అతని కుమారుడు అక్కడి నుండి పారిపోయారు.

 

Read more RELATED
Recommended to you

Latest news