బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. అభయహస్తం, బంగారుతల్లి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు ఎలాంటి సాయం అందడంలేదన్నారు. బలహీనులను ఇబ్బంది పెట్టడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ధరణి పోర్టల్ గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతోందని… మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతితో బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అవుతుందని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కాంగ్రెస్హాయంలోనే జరిగిందన్నారు. పాల్వంచలో కేటీపీఎస్ కాంగ్రెస్ప్రభుత్వంలోనే వచ్చిందన్నారు. కానీ 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఆగిపోయిందనేది..? ఇప్పుడు బీఆర్ఎస్ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే అవినీతి వలన ప్రభుత్వం పతనం అవుతుందన్నారు. కేసీఆర్ మొదటి క్యాబినెట్‌లో మహిళా మంత్రినే లేకపోవడం ఆ ప్రభుత్వ పాలసీ విధానం అందరికీ అర్థమవుతుందన్నారు.