విమెన్స్ డే స్పెషల్ : తండాకే వెలుగు ఇచ్చిన లోక‌ల్ సెల‌బ్రెటీ.. చిమ్నీబాయి క‌థ‌

-

సాధార‌ణంగా మ‌హిళ‌లు అంటే వంటి ఇంటికి మాత్ర‌మే ప‌రిమితం అయి ఉంటారు. వాళ్లు బ‌య‌ట‌కు అడుగు పెట్టాలంటే.. స‌మాజం పెట్టే ఎన్నో ఆంక్షల‌ను దాటుకుని రావాలి. అయితే స‌మాజానికి భ‌య‌ప‌డి చాలా మంది మ‌హిళ‌లు త‌మ ధైర్యాన్ని వంటి గ‌దిలోనే మగ్గ‌నిస్తున్నారు. అయితే ఇప్ప‌టి త‌రం వారు ఈ క‌ట్టుబాట్ల‌ను తెంచుకుని స‌మాజానికి గుణ‌పాఠం చెబుతూ.. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం కాలంలో కూడా కొంత మంది పాత త‌రం వాళ్లు.. ఇంటి గ‌డ‌ప దాటలంటే భ‌య‌ప‌డుతుంటారు. అయితే ఒక మ‌హిళ అలా చేయ‌లేదు.

కొంచెం ధైర్యం ఉంటే జ‌నాల‌కు అరువు కావాలి
అని అంటారే! కానీ ఈమె ధైర్యం ద‌గ్గ‌ర హ‌రీశ్ రావు
ఆశ్చ‌ర్య పోయారు. బిత్త‌ర‌వు అయ్యారు.
అచ్చెరువొందారు. పాల‌క ప‌క్షంను నిల‌దీస్తే
మంచి ఫ‌లితాలు వ‌స్తాయి..మ‌న తండాల‌కు వెలుగులు
వాటితో పాటు వ‌న్నెలు చేకూరుతాయి అనేందుకు తార్కాణ‌మీ క‌థ
స్ఫూర్తి నిండిన జీవితమొక వికాస పాఠం రేప‌టి వేళ

త‌న కుటుబం స‌మస్య కోసం కాదు.. ఏకంగా తాను నివాసం ఉంటున్న ఒక తండా స‌మ‌స్య కోసం పోరుబాట ప‌ట్టింది. మండ‌ల అధికారుల నుంచి.. జిల్లా అధికారుల వ‌ర‌కు వెళ్లింది. అయినా.. స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో ఏకంగా మంత్రి హ‌రీష్ రావు వ‌ద్దకే వెళ్లింది. అంతే కాకుండా ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్ద‌కే వెళ్లింది. ఆమెనే లోకల్ సెల‌బ్రెటీ చిమ్నీబాయి. నారాయ‌ణ ఖేడ్ లోని స‌ర్ధార్ తండా లో నివాసం ఉండే చిమ్నీ బాయి.. త‌న తండా స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు వెళ్లింది. చిమ్పీ బాయి.. నారాయ‌ణ ఖేడ్ ఉప ఎన్నిక‌ల వ‌ర‌కు చిమ్నీ బాయి గురించి ఎవ‌రికీ తెలియదు. కానీ నారాయ‌ణ ఖేడ్ ఉప ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్.. చిమ్నీ బాయి అంటూ పేరు పెట్టి పిలిచి ఆమె చేసిన ఘ‌న‌త తెలంగాణ స‌మ‌జానికి బ‌హిరంగ స‌భ‌లో తెలిపారు.

 

అలాగే ఇటీవ‌ల సీఎం కేసీఆర్ మ‌రోసారి నారాయ‌ణ ఖేడ్ కు వ‌చ్చిన స‌మ‌యంలో చిమ్నీ బాయిని గుర్తు పెట్టుకుని మ‌రి ప‌ల‌క‌రించారు. అంతే కాకుండా త‌న‌తో స‌మానంగా స్టేజ్ పై కూర్చిండ‌బెట్టి సీఎం కేసీఆర్ మాట్లాడారు. దీంతో ఎక్క‌డో తండాలో పుట్టి.. యావ‌త్ రాష్ట్రాన్ని త‌న వైపు న‌కు తింపుకున్న చిమ్నీబాయి ఇప్పుడు ఒక లోక‌ల్ సెల‌బ్రెటీ అయిపోయింది. ఒక తండా కు మంచి నీరు, రోడ్డు సౌక‌ర్యం, క‌రెంటు ను తీసుకువ‌చ్చి ఎందరో మ‌హిళ‌ల‌కు చిమ్నీబాయి ఆద‌ర్శం గా నిలుస్తుంది. ఉమెన్స్ డే రోజు ఇలాంటి మ‌హిళ‌ల గురించి మాట్లాడుకోవ‌డంలో చాలా గొప్ప విషయం. చిమ్నీ బాయిని ఆదర్శంగా తీసుకుని మ‌హిళ‌లు ముందుకు సాగాలి.

Read more RELATED
Recommended to you

Latest news