వయసు పెరిగే కొద్ది రాత్రుల్లు నిద్రలేమి సమస్య ఎక్కువైపోతుంది. మన ఇళ్లలో ముసలివారిని చూడండి.. నైట్ పడుకుంటారు కానీ.. ప్రశాంతంగా నిద్రపోరు. చిన్న శబ్ధానికే లేస్తారు. ఇక ఐదు గంటలకే లేచి కుర్చుంటారు. వాళ్లకు పాపం సరిగ్గా నిద్రపట్టదు. అసలు ఏజ్ ఎక్కువయ్యే కొద్ది నిద్ర ఎందుకు దూరం అవుతుంది..? ఇదే అంశంపై అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాళ్లు చెప్పే రీజన్స్ ఏంటంటే..
అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, ఒక వ్యక్తి నిద్ర-మేల్కొనే స్థితిని నియంత్రించే మెదడులోని భాగం వయస్సుతో ఎలా బలహీనపడుతుందో వారు కనుగొన్నారు. వృద్ధులలో నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు మందులు ఇస్తారు. వయస్సుతో ఈ మందుల ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుందట. అయితే న్యూరాన్ల ద్వారా విడుదలయ్యే మెదడులోని కొన్ని భాగాలలో ప్రత్యేక రసాయనాలు హైపోక్రెటిన్లు కనిపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ రసాయనం తగ్గిపోయి నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతాయట.
అమెరికన్ శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు… ఇందుకోసం ఎలుకల రెండు బృందాలుగా చేశారు. మొదటి సమూహంలో 3 నుండి 5 నెలల వయస్సు, రెండవ సమూహం 18 నుండి 22 నెలల వయస్సు గల ఎలుకలు ఉన్నాయి. మెదడులోని న్యూరాన్లు కాంతిని ఉపయోగించి ప్రేరేపించారు. దీని తర్వాత ఇమేజింగ్ టెక్నిక్లతో మెదడును సైంటిస్టులు పరిశీలించారు. విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న ఎలుకల కంటే పెద్ద ఎలుకలు 38 శాతం ఎక్కువ హైపోక్రెటిన్లను కోల్పోయాయని నివేదికలో తేలింది.
నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు మెరుగైన ఔషధాలను సిద్ధం చేయవచ్చని పరిశోధకులు అంటున్నారు. వయస్సుతో ఔషధాల తగ్గుదల ప్రభావాన్ని నియంత్రించవచ్చు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు తమకు మంచి నిద్ర రాదని సైంటిస్ట్ లూయిస్ డి లెసియా తెలిపారు.
మంచి నిద్రకు.. మెదడు ఆరోగ్యానికి సంబంధం ఉంది. అందుకే వృద్ధుకు గుండెకు, మెదడుకు మేలు చేసే ఆహారం, డ్రై నట్స్ ఇస్తుంటే.. వారికి వచ్చే సమస్యల శాతాన్ని తగ్గించవచ్చు.
-Triveni Buskarowthu