మహిళల ప్రపంచ కప్ లీగ్ దశ మ్యాచ్ లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. కాగ మూడు, నాలుగో స్థానం కోసం భారత్, వెస్టీండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈ రోజు ఇప్పటికే సెమీ ఫైనల్ కు చేరుకున్న సౌత్ ఆఫ్రికాను భారత్ మహిళల జట్టు ఢీ కొట్టబోతుంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తేనే.. సెమీ ఫైనల్ కు వెళ్లడానికి అవకాశాలు ఉంటాయి.
ఒక వేళ భారత్ ఓడిపోతే.. ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. కాగ ఈ మ్యాచ్ కు సంబంధించి భారత్ ఉమెన్స్ జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు బౌలింగ్ చేయనుంది. అయితే భారత్, సౌత్ ఆఫ్రికా తుది జట్లు ఇలా ఉన్నాయి.
భారత ఉమెన్స్ తుది జట్టు :
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, మిథాలీ రాజ్ ( కెప్టెన్ ), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ( వికెట్ కీపర్ ), పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, దీప్తి శర్మ, మేఘనా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్
సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ తుది జట్టు :
లిజెల్ లీ, లారా వోల్వార్డ్ట్, లారా గూడాల్, సునే లూస్ ( కెప్టెన్ ), మిగ్నాన్ డు ప్రీజ్, మారిజానే కాప్, క్లో ట్రయాన్, త్రిషా చెట్టి ( వికెట్ కీపర్ ), షబ్నిమ్ ఇస్మాయిల్, మసాబటా క్లాస్, అయాబొంగా ఖాకా