World Blood Donor Day 2022: రక్త దానం పై అపోహలు వదలండి..మరోకరికి ప్రాణం పొయ్యండి..

-

రక్తం దానం చెయ్యడం వల్ల మరో ముగ్గురు ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు.అన్ని దానాలలో కన్నా రక్త దానం మంచిదని అంటున్నారు.రక్తదానం చేసేవాళ్లని ప్రాణదాతలంటుంటారు.అయితే చాలా మంది రక్త దానం చెయ్యడం తప్పు అని, మనకు ఏదైనా అవుతుందని వెనుకాడుతుంటారు ఎందుకంటే అది వారి శరీరంలో హిమోగ్లోబిన్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుందని, తీవ్ర బలహీనతకు దారి తీస్తుందని వారు భావిస్తుంటారు. కానీ రక్తదానం చేయడం వల్ల ఒకరి జీవితాన్ని కాపాడటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తదానం చేయడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వారు సూచిస్తున్నారు. ఈక్రమంలో రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు..రక్త దానం చెయ్యడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గుండె జబ్బులు, క్యాన్సర్ కు చెక్..

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఐరన్ సమతుల్యంగా ఉంటుంది. అంతేకాదు గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందుతారు..ఇంకా ఎన్నో ఉన్నాయి..

అధికబరువుకు చెక్..

బరువు ఎక్కువగా ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తదానం చేస్తూ, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే శరీరంలోని క్యాలరీలు వేగంగా బర్న్‌ అవుతాయి. ఫలితంగా బరువు పెరగకుండా అదుపులో ఉంటుంది.

వీటితో పాటు హిమోగ్లోబిన్‌ లెవెల్స్ తగ్గుతాయని, శరీరం బలహీనంగా తయారవుతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి అపోహలను నమ్మోద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్లడ్‌ డొనేషన్‌తో శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, కొద్ది రోజల్లోనే శరీరానికి అవసరమైన ఎర్రరక్త కణాలు ఉత్పత్తి అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

రక్తదానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే మనం ఓ మంచి పని చేసినప్పుడల్లా, అది మంచి అనుభూతిని కలిగిస్తుంది. అది మన మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి రక్తదానం చేయడమంటే మనం ఒకరికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నట్టే లెక్క..దాంతో మరొకరి ప్రాణం కాపాడామన్న సంతోషం కూడా ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news