వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శ్రీలంక మరియు సౌత్ ఆఫ్రికా లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక బౌలింగ్ ఎంచుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకువెళుతోంది. అంతగా వరల్డ్ కప్ అనుభవం లేని ఆటగాళ్లను నమ్ముకుని ఇండియాకు వచ్చిన శ్రీలంక యాజమాన్యం ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉంది. కేవలం సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా వికెట్ ను తీయడం మినహా శ్రీలంక బౌలర్లు సాధించింది ఏమీ లేదు. ఆ తర్వాత రెండవ వికెట్ కు డికాక్ మరియు డస్సెన్ లు 204 పరుగులు జోడించి సౌత్ ఆఫ్రికా ను పటిష్టమైన స్థితిలో నిలబెట్టారు. ముందుగా ఓపెనర్ డికాక్ 84 బంతుల్లో ఫోర్లు మరియు 2 సిక్సులతో సరిగ్గా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మధుశాఖ బౌలింగ్ లో అవుట్ అయినా.. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు.
ఇక వన్ డౌన్ లో వచ్చిన డస్సెన్ సైతం సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు. ఇతను ప్రస్తుతం 107 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇంకా చేతిలో ఎనిమిది వికెట్లు ఉండడంతో 400 పరుగులు చేయడానికి సౌత్ ఆఫ్రికా ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.