కరోనా వైరస్ మొదటి వేవ్ వచ్చింది. అప్పుడు వచ్చిన ఆ వార్నింగ్ ని ఎవరూ పట్టించుకోలేదు ఒకవేళ కనుక వాటిని పట్టించుకుని ఉంటే ఈ సెకండ్ వల్ల ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు అని ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండమిక్ రీసర్చ్ అండ్ రెస్పాన్స్ చెప్పడం జరిగింది.
ఒకవేళ కనుక ఫస్ట్ వేవ్ ని అప్పుడు వచ్చిన కష్టాలని పరిగణ లోకి తీసుకుంటే తప్పకుండా ఈ మహమ్మారి నుండి బయట పడే వాళ్ళం. అది పట్టించుకోక పోవడం వల్లే ఇంత పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పారు.
ఒకవేళ కనుక వాటిని సీరియస్ గా తీసుకుంటే ఇంటర్నేషనల్ సిస్టం ఇంకా బాగా జాగ్రత్తలు తీసుకునేది అని అన్నారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ప్యానల్ డిక్లేర్ చేసింది. మొదటిగా వచ్చిన దానిని సీరియస్ గా తీసుకోవడం వల్ల ఇంత మంది మరణించారని ఎందరో ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నారని వెల్లడించారు.
భవిష్యత్తు లో ఇటువంటి మహమ్మారి రాకుండా ఉండేందుకు ప్యానెల్ హై లెవెల్ గ్లోబల్ హెల్త్ థ్రెట్స్ కౌన్సిల్ ప్రారంభించింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం 160,058,714 కేసులు 3,326,305 మంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు.