ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్‌కు చెందిని 65 ఏళ్ల వ్యక్తిలో ‘ఈఎంఎం నెగిటివ్’ చెందిన రక్తపు గ్రూపును వైద్యులు కనుగొన్నారు. ఇలాంటి బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే పది మందికి ఉంది. అలాంటి రక్తపు గ్రూపును కలిగిన పదో వ్యక్తిగా గుజరాత్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. భారత్‌లో ఈ బ్లడ్ గ్రూపు ఈయనకు మాత్రమే ఉంది. అయితే సాధారణంగా ఏ, బీ, ఓ, ఏబీ ఇలా బ్లడ్ గ్రూపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలోనే ఈఎంఎం నెగిటివ్ ఎంతో ప్రత్యేకమైనది.
మానవ శరీరంలో నాలుగు రకాల రక్త సమూహాలలో ఏ, బీ, ఓ, ఆర్ హెచ్ వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. కానీ, ఈఎంఎంలో 375 రకాల యాంటిజెన్లు ఉంటాయి. ఇలాంటి బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం దానం చేయడం కానీ, ఇతరుల నుంచి రక్తం స్వీకరించే అవకాశం ఉండదని వైద్యులు తెలిపారు. అయితే గుజరాత్‌కు చెందిన ఈ వ్యక్తికి గుండె సమస్య. దీనికి సంబంధించిన సర్జరీ కోసం చేసిన రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ తరుణంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ బయట పడిందని వైద్యులు తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ ఈఎంఎం నెగిటివ్ అని నామకరణం చేసింది.