నేను నోరు తెరిస్తే మీరు అన్ని మూసుకోవాల్సి వస్తుంది.. పవన్ కళ్యాణ్ పై చిన్నికృష్ణ ఫైర్..!

కృష్ణా జిల్లా ప్రచారంలో తెలంగాణా ఏమైనా పాకిస్తానా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే రాజకీయ ప్రముఖులు తమ స్పందన తెలియచేయగా హైదరాబాద్ లో ఉంటున్న ఏపి సెటిలర్స్ తరపున సిని రచయిత చిన్ని కృష్ణ పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యాడు. మీ రాజకీయ లబ్ధి కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దని.. రాష్ట్రం విడిపోయేప్పుడు కె.సి.ఆర్ ఏదైతే హామీ ఇచ్చాడో అదే చేస్తున్నారని.. తెలంగాణాలో ఏపి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.

మెగా ఫ్యామిలీ మొత్తం సినిమా పరిశ్రమకు ఏం చేసింది లేదని.. ఇప్పుడు కాపు వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఏదో చేయాలని చూస్తున్నారని అన్నారు. తాను కూడా కాపు కులస్తుడని.. ఎన్నికల తర్వాత తాను అసలు విషయాలను బయట పెడతానని.. తాను నోరు తెరిస్తే మీ నవరంధ్రాలు మూసుకుంటారని పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చాడు చిన్ని కృష్ణ.

వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై చిన్ని కృష్ణ మండిపడ్డారు. కాపు యువతని పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టిస్తున్నారని.. చంద్రబాబుతో పవన్ చేతులు కలిపాడని అన్నారు చిన్ని కృష్ణ. మరి చిన్ని కృష్ణ వ్యాఖ్యలకు పవన్ ఎలా స్పందిస్తాడు సడెన్ గా చిన్ని కృష్ణ సీన్ లోకి ఎందుకు వచ్చాడు అన్నది తెలియాల్సి ఉంది.