రెడ్‌మీ నోట్ 9 ఫోన్లు అదిరిపోయాయ్‌.. ధ‌ర ఎంతంటే..?

-

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ రెడ్‌మీ సిరీస్‌లో నోట్ 9 ప్రొ, నోట్ 9 ప్రొ మ్యాక్స్ పేరిట రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను గురువారం భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేల‌ను ఏర్పాటు చేశారు. వీటికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. అలాగే స్నాప్‌డ్రాగ‌న్ 720జి అధునాత‌న ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇక రెడ్‌మీ నోట్ 9 ప్రొ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, నోట్ 9 ప్రొ మ్యాక్స్‌లో వెనుక భాగంలో 64 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్ల‌లో అందిస్తున్న పూర్తి స్థాయి ఫీచ‌ర్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

xiaomi redmi note 9 pro note 9 pro max phones launched in india

రెడ్‌మీ నోట్ 9 ప్రొ, నోట్ 9 ప్రొ మ్యాక్స్ ఫీచ‌ర్లు…

* 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్‌, 4/6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* నోట్ 9 ప్రొ – 48, 8, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* నోట్ 9 ప్రొ మ్యాక్స్ – 64, 8, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* నోట్ 9 ప్రొ – 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* నోట్ 9 ప్రొ మ్యాక్స్ – 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5020 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

కాగా రెడ్‌మీ నోట్ 9 ప్రొకు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.15,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 17వ తేదీ నుంచి అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు.

ఇక రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.14,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.18,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 25వ తేదీ నుంచి అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌ల‌లో విక్ర‌యించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news