రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా? – సీఎం జగన్ కి యనమల సవాల్

-

అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు, రోజుకో నిబంధన ఉల్లంఘిస్తుందని అంటూ మండిపడ్డారు టిడిపి పోలీసు బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. అప్పులపై సీఎం జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు నేను సిద్ధం అన్నారు.

రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు యనమల. ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడం లేదని కాగ్ చెప్పిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. గతంలో కన్నా తక్కువ అప్పులు చేస్తున్నామంటూ సీఎం జగన్ మరోసారి అబద్ధ ప్రచారానికి తెర లేపారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.6 లక్షల 38వేల కోట్లు అప్పు చేసిందన్నారు.

అప్పులు 3.98 లక్షల కోట్లు, హఫ్ బడ్డెట్ బారోయింగ్ 93 వేల కోట్లు, కార్పొరేషన్ గ్యారెంటీలు 1.47 లక్షల కోట్లు.. వీటికి అదనంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లల్లో ఉంటాయన్నారు. జగన్ ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేనాటికి అప్పు రూ.11 లక్షల కోట్లకు పైగా చేరుతుందన్నారు. కార్పొరేషన్లు, వివిధ సంస్థల ద్వారా తీసుకొస్తున్న అప్పుల లెక్కలను చూపకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version