జగన్ ప్రభుత్వంలో రూ. 48 వేల కోట్ల భారీ స్కాం : యనమల సంచలనం

-

జగన్ ప్రభుత్వంపై యనమల సంచలన ఆరోపణలు చేశారు. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు యనమల డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు- అవివీతి తప్ప మరేం జరగలేదని.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేం లేదని ఫైర్ అయ్యారు.

కోర్టుల తీర్పులపై సభలో చర్చలు పెడుతున్నారని.. ఉభయ సభలను వాళ్ల సొంతానికి వాడుకుంటున్నట్టు కన్పిస్తోందని మండిపడ్డారు. కోర్టులను, చట్ట సభలను కూడా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వమని.. రూ. 48 వేల కోట్ల ఖర్చులకు సంబంధించిన లెక్కలు లేవని కాగ్ చెప్పిందని గుర్తు చేశారు.

రూ. 1.78 లక్షల కోట్లు ఖర్చు పెడితే రూ. 48 వేల కోట్లకు లెక్కల్లేవని.. రూ. 48 వేల కోట్లు నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు చేశారు. ప్రజల కోసం రూ. 48 వేల కోట్లు ఖర్చు పెడితే లెక్కలు స్పెషల్ బిల్లులనే ప్రొవిజన్ లేకుండానే ఖర్చు పెట్టేశారని అగ్రహించారు. దాణా స్కామును కూడా కాగ్ నివేదికే బయటపెట్టిందని.. కాగ్ నివేదిక ఆధారంగానే విచారణ చేశారు.. స్కామ్ జరిగిందని తేల్చారన్నారు. ఏపీలోని రూ. 48 వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని కాగ్ నివేదికే బయటపెట్టిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news