ఆయనతో నటించాలని ఉంది.. KGF హీరో యశ్

-

శాండల్ వుడ్ (కన్నడ) స్టార్ హీరో యశ్.. KGF చాప్టర్ 1, 2 లతో పాన్ ఇండియా వైడ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా ఆయన తదుపరి చిత్రం ఏంటని వేచి చూస్తోంది. అయితే, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు.

కేజీఎఫ్ చాప్టర్ 1, 2 లతో యశ్ కు దేశవ్యాప్తంగా చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. చాలా మంది హీరోయిన్స్, నటీ నటులు యశ్ తో నటించాలని ఉందని అంటున్నారు. కాగా, తన మనసులో మాట బయటపెట్టారు యశ్. తనకు ఆ పాపులర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తో నటించాలని ఉందని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ నటుడు ఎవరంటే..

nawazuddin siddiqui
nawazuddin siddiqui

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ న‌వాజుద్దీన్ సిద్దిఖీ తో ఒక్క సినిమాలో నైనా నటించాలని ఉందని యశ్ పేర్కొన్నారు.మాస్ ఇమేజ్ ఉన్న నవాజుద్దీన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని యశ్ తెలిపారు. దాంతో యశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.

త్వరలో దర్శక నిర్మాతలుఈ కాంబో గురించి ఆలోచించాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నవాజుద్దీన్ పలు హిందీ ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం.. ప్రభాస్ తో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news