ఏపీ ఎస్ఈసీ కి కౌంటర్ గా వైసీపీ యాప్ తయారు చేసింది. ఈ-నేత్రం పేరుతో యాప్ ను వైసీపీ అందుబాటులో కి తీసుకుని వచ్చింది. క్షేత్ర స్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం తమ క్యాడర్ కి కల్పిస్తూ ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేసే సౌలభ్యంకల్పిస్తోంది. ఈ ఫిర్యాదులను పార్టీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తుందని చెబుతున్నారు.
ఎస్ఈసీ విడుదల చేసిన ఈ-వాచ్ యాప్ పై వైసీపీ ముందు నుండీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. యాప్ తయారీ నిబంధనలకు విరుద్ధం అని వైసీపీ చెబుతోంది. ఐదు కోట్ల ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంటూ ఎస్ఈసీకి వైఎస్ఆర్ సిపి ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ కార్యాలయంలో వైసీపీ నేతలు ఫిర్యాదు లేఖ అందజేశారు. ఈ-వాచ్ యాప్ ను వెంటనే ఉపసంహరించుకొని కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల యాప్ లను వినియోగించాలని లేఖలో వైసీపీ విజ్ఞప్తి చేసింది.