ఏపీలో ఇప్పుడు ఎవరి హవా సాగుతోందని ఎవరైనా అడిగితే కచ్చితంగా వైసీపీదే అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ ప్రజల్లో అలా ఆదరణ కొనసాగిస్తోంది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో చాలా వరకు కూడా ప్రజల్లో బాగానే ఆదరణ సంపాదించుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం పని అలా ఉన్న ఆకూడా ఇటు వైసీపీ నేతల్లోనే టెన్షన్ మొదలవుతోందని తెలుస్తోంది. అధికార పార్టీ కాబట్టి కచ్చితంగా పదవుల విషయంలోనే ఈ అసంతృప్తులు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు ఒకటే కారణమంట.
ఇ్పటికే వైసీపీ పార్టీ అధికారంలోకి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నా కూడా చాలామంది సెకడ్ గ్రేడ్ నేతలు ఇంకా తీవ్ర నిరాశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మెజారిటీ వర్గాలకు చెందిన సెకండ్ గ్రేడ్ నేతలు పార్టీని నమ్ముకుని ఇంకా ఉంటున్నా కూడా పదువులు రాక చాలా కొంత నష్టపోయినట్టు భావిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీలోఉంటున్న నేతలందరూ కూడా ఆధిపత్య ధోరణిలో ఉండటంతో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుస్తోంది.
ఒకప్పుడు పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలన్నా కూడా ఆ నియోజకవర్గంలోని పై స్థాయి నేతలను అడిగి ఏ వర్గానికి ఇవ్వాలో వారకి మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సారి అలా చేయకుండా సీఎం జగన్ స్వయంగా పార్టీలో అటు ప్రజల్లో ఎవరికి మంచి గుర్తింపు ఉంటే వారికే కేటాయిస్తున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన తమను కాదని వేరే వారికి ఇలా పదవులు ఇవ్వడంతో వారంతా కూడా జగన్ మీద కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయంలో అటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంత అసహనంతోనే ఉన్నారంట.