రఘురామకు మరో షాక్.. లోక్ సభ స్పీకర్ కు వైసీపీ లేఖ

అమరావతి : లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ పక్షం మరో లేఖ రాసింది. పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై మరోసారి అనర్హత పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్న విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించినా తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొంది వైసీపీ పార్లమెంటరీ పక్షం. డిస్ క్వాలిఫికేషన్ విషయంలో జాప్యం చేయడం దురదృష్టకరమని కూడా లేఖలో పేర్కొంది వైసీపీ.

అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే ఆ లోక్ సభ పరిధిలోని ప్రజలకు అన్యాయం చేసినట్టేనని… నర్సాపురం లోక్ సభ నియోజకవర్గానికి అనర్హుడైన రఘ రామకృష్ణంరాజు ప్రజా ప్రతినిధిగా ఉన్నారని వైసీపీ వెల్లడించింది. రఘురామకృష్ణం రాజు స్థానంలో అర్హుడైన వ్యక్తి ఎంపీగా ఉండాలని పేర్కొంది. వెంటనే రఘురామ కృష్ణం రాజు పై చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరింది. కాగా ఇటీవలే వైసీపీ..  ఇదే విషయంపై  లోక్ సభ స్పీకర్ ను కలిసిన విషయం తెలిసిందే.