రెండు కేసులు ఉంటే ఆపారు… ఎన్నికల కమీషన్ పై వైసీపీ ఎంపీ ఫైర్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కాస్త దుమారం రేపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కాస్త దూకుడుగానే ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏంటీ అనేది ఆసక్తికరంగా ఉంది. ఏపీ సర్కార్ మాత్రం ఎన్నికల నిర్వహణ అనేది వద్దు అని పట్టుబడుతుంది. తాజాగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు.

రోజుకు రెండు కేసులు నమోదైన సమయంలోనే ఎన్నికలను వాయిదా వేశారని… కోవిడ్ సెకండ్ వేవ్ లో ఎన్నికలు జరుపుతారా? అని ఆయన నిలదీశారు. ఇప్పటికే 25 శాతం స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడైనా వైసీపీదే విజయం అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ స్పష్టం చేసారు.