ఆ హీరోతో రెండోసారి.. బాలీవుడ్ లో గట్టి ఛాన్స్ కొట్టేసిన రకుల్.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ బంపర్ ఆఫర్ పట్టేసింది. ఇప్పటికే అక్కడ రెండు మూడు సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడుకి మంచి ఛాన్స్ వచ్చేసింది. అమితాబ్ బచ్చన్ తో తెరపంచుకునే అదృష్టం దక్కించుకుంది. మే డే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో అమితాబ్, కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైంది.

అజయ్ దేవగణ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో షూటింగ్ కి వెళ్ళనుంది. ఇందులో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడు. ఇది వరకే దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగణ్ తో మెరిసిన రకుల్, మరోమారు అజయ్ సరసన కనిపించనుంది. తెలుగులో ఒకటి రెండు మినహా పెద్దగా ఆఫర్లు లేని ఈ అమ్మడుకి బాలీవుడ్ లో సాలిడ్ అవకాశం రావడం అదృష్టమే.