రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీలు

-

రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ను వైసిపి పార్టీ ఎంపీలు కలిశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసింది వైఎస్ఆర్సిపి ఎంపిల బృందం. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు టిడిపి కుట్రపూరితంగా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎంపై చేస్తున్న బూతు వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు వైఈసీప ఎంపీలు.

తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు. చంద్రబాబు తప్పులను వివరించడానికే రాష్ట్రపతిని కలిసామని.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చి రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్నవారిని కలిశారని మండిపడ్డారు వైసిపి పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.

రాష్ట్ర ప్రయోజనాలను ఎలా తాకట్టు పెట్టారో రాష్ట్రపతికి వివరించామని…. టిడిపి కల్చర్ బూతుల కల్చర్ అని నిప్పులు చెరిగారు. టిడిపి నేతలు మాట్లాడేది బూతు భాష అని… టిడిపి అనడం కన్నా తెలుగు బూతుల పార్టీ అంటే సమంజసంగా ఉంటుందని పేర్కొన్నారు. బోసిడికే అన్న పదాన్ని రాష్ట్రపతికి ఎలా చెప్పాలన్న దానిపై చాలా సంకోచించామని… వైసిపి సంస్కారవంతమైన పార్టీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news