ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కేబినెట్‌లో చేరబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏలో వైసీపీ చేరే అంశం మీద చాల రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి సీఎం జగన్ – మోడీలు ఇవాళ రేపటిలో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎన్డీఏలోకి వైసీపీ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలే వ్యతిరేకించిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చినప్పుడు కేసుల భయం అని విమర్శలు వచ్చాయి కానీ అంతకు మించిన ప్లాన్ బీజేపీ సిద్దం చేసిందని అంటున్నారు. మోడీ పిలుపు మేరకు ఎన్డీఏలో చేరేందుకు వైసీపీ సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. అందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నట్టు చెబుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు వైసీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ఇటీవలే ఆకాళీదళ్ ఎన్డేఏకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్లేస్ లోకే వైసీపీని తీసుకోనున్నారని అంటున్నారు.