రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్ ఆర్ ఎస్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఎల్ ఆర్ ఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గాలని దీని వలన ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుందని విపక్షాలు నిరసనలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా విమర్శలు చేసారు. కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తోందని ఆరోపించారు. ఇంటి అద్దెలు కట్టొద్దన్న కేసీఆర్ హాస్పిటల్ బిల్లులు ఎందుకు కట్టలేదని ఆమె ప్రశ్నించారు. చిత్త శుద్ధి ఉంటే ఈ కాలం లో ప్రజలను ఆదుకోవాలని అన్నారు. కానీ ఎల్ ఆర్ ఎస్ పేరిట దోచుకునే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎవరూ ఎల్ ఆర్ ఎస్ కట్టొద్దని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగానే క్రమబద్దీకరిస్తుంది అని స్పష్టం చేసారు.