`అక్ష‌రాలా` బాబును కాపాడుతున్న ఎల్లో మీడియా..!

-

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీ తొలిస్థానంలో ఉంద‌ని కేంద్రం రిపోర్టు ఇచ్చిన త‌ర్వాత రోజు.. ఆస‌క్తిక‌రంగా దేశ అక్ష‌రాస్య‌త‌లో ఏపీ అట్ట‌డుకు చేరిన‌ట్టు నివేదిక‌ను వెలువ‌రించింది. ఈజ్ ఆప్ డూయింగ్ తొలి రాంక్ చంద్ర‌బాబు ఘ‌న‌తేన‌ని చాటుకున్న ఎల్లో మీడియా.. అక్ష‌రాస్య‌త విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు పాల‌న‌పై ఎక్క‌డ మ‌ర‌క‌లు అంటుకుంటాయోన‌ని ముందు జాగ్ర‌త్త తీసుకుంది. ఈ క్ర‌మంలోనే దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ప‌రిస్థితి ఇలానే ఉంద‌ని, చంద్ర‌బాబు పాల‌న‌పై ఎవ‌రూ విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని అన్న‌ట్టుగా వార్త‌ను రాసింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి ర్యాంకులు రావ‌డం వెనుక చంద్ర‌బాబు వ్యూహం ఏమేర‌కు ఉంద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారో.. అదే రేంజ్‌లో లోపాల‌కు కూడా ఆయ‌న బాధ్య‌త ఉంటుంద‌నేది వాస్త‌వం. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని 9 సంవ‌త్స‌రాలు ఆయ‌న పాలించారు. అదే స‌మ‌యంలో విభ‌‌జ‌న త‌ర్వాత కూడా ఏపీని పూర్తిగా ఐదేళ్లు చంద్ర‌బాబు ఏలారు. అక్ష‌రాస్య‌త అంశం అనేది ప్ర‌తి ఏటా కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించేదే. లేదా.. తాను ఆ ప‌నిచేయాల‌ని భావిస్తే.. ఈ విష‌యం చంద్ర‌బాబు తెలుసుకునేందుకు పెద్ద‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు.

ఆన్‌లైన్‌లో వెతికినా.. లేదా అధికారుల‌ను అడిగినా.. వారైనా తెచ్చిపెడ‌తారు. కానీ, అక్ష‌రాస్య‌త విష‌యంలో గ‌డిచిన 9 సంవ‌త్స‌రాలు, త‌ర్వాత ఇటీవ‌ల వ‌ర‌కు గ‌డిచిన ఐదేళ్లు కూడా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. దీనిని ప్ర‌ధానంగా ప్ర‌స్థావించాల్సిన అవ‌స‌రం ఉంది. స్వాతంత్రం వ‌చ్చిన నాటి నుంచి ఇదే ప‌రిస్థితి అంటూ.. రాసుకు రావ‌డం వెనుక ఖ‌చ్చితంగా చంద్ర‌బాబును ర‌క్షించే ప్ర‌క్రియ దాగి ఉంద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పాల‌న‌లో మెరుపులు మెరిపించాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చే చంద్ర‌బాబు.. ఈ విష‌యంలో ఎందుకు విఫ‌ల‌మ‌య్యారో .. వివ‌రించి ఉంటే.. నిజ‌మైన పాత్రికేయ విలువ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు ఉండేది. కానీ, రాష్ట్రానికి ర్యాంకులు వ‌స్తే.. బాబు ఘ‌న‌త‌గాను, ఏదైనా లోపాలు ఉంటే.. మిగిలిన వారివి… అన్న‌ట్టుగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై విమ‌ర్శ‌లు రాకుండా ఉంటాయా?! అదే ఇప్పుడు జ‌రుగుతోంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news