వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పే… తప్పు ఒప్పున్న టీడీపీ నాయకులు

-


ఏదైనా తమ వరకు వస్తే గానీ తెలియదంటారు.. ఇది ముమ్మాటికీ టీడీపీ పార్టీకి సరిపోతుంది. గత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకుంది. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీకి మిగిలింది కూడా 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు.. ఆ ముగ్గురు ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోయారు.

అప్పట్లో తాము చేసింది కరెక్టే, అభివృద్దిని చూసి మా పార్టీలో చేరుతున్నారంటూ చెప్పుకొచ్చిన నాయకులకు ఇప్పటి పరిస్థితికి ఏమి చెప్పాలో అర్థంకాకుండా ఉంది. మీ పార్టీ ఎంపీలను బీజేపీ తమ పార్టీలోకి తీసుకుంది కదా.. దానిపై స్పందనను తెలపాలని టీడీపీ సీనియర్‌ నాయకులు యనమల రామకృష్ణుడు గారిని అడిగితే.. వచ్చిన సమాధానం.. “23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నాము అయితే ఎలక్షన్లో ఏమైంది” అని ఎదురు ప్రశ్నించాడు.

మరో నాయకుడు కంభంపాటి రామ్మోహన్‌రావు ని ఇదే ప్రశ్న అడిగితే.. ” మేము 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పే అలాంటి వాటిమీద చర్చ జరగాలి వీటికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడాలి” అంటూ చెప్పుకొచ్చాడు..

ఇక క్రింది స్థాయి కార్యకర్తలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి.. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల ఒరిగింది ప్రత్యేకంగా ఏమీ లేదు.. వైసీపీని బలహీన పరుస్తున్నామన్న ఆనందం తప్ప అంటూ ఓ సగటు కార్యకర్త చెప్పకొచ్చాడు..

మొత్తానికి చేసింది తప్పేనంటూ ఇప్పుడు అంగీకరిస్తున్నారు తెలుగు దేశం నాయకులు.. ఆ తప్పు మా నాయకుడు చెయ్యడంటూ కాలర్‌ ఎగరేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.. అదీ సంగతి.. అందుకే వాపును చూసి……… …. అదన్నమాట

Read more RELATED
Recommended to you

Latest news