భర్త బీరు తాగనివ్వలేదని విడాకులు కోరిన భార్య..!

507

ఒకవేళ విడాకులు ఇవ్వకపోతే.. అత్త, మామ, భర్తపై తప్పుడు కేసులు పెడుతానని బెదరిస్తోందట. దీంతో ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తి తనలో తానే బాధపడిపోతున్నాడట.

రోజురోజుకూ భార్యాభర్తల మధ్య బంధం బలహీన పడుతుందనడానికి చాలా ఉదాహరణలు చూశాం. ఇది ఒక ఉదాహరణే. భర్త బీరు తాగనివ్వలేదని ఓ భార్య తన నుంచి విడాకులు కోరింది. విడాకులంటే అంత చులకన అయిపోయాయి. అది కూడా పెళ్లయిన కొన్ని రోజులకే. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది.

అహ్మదాబాద్ కు చెందిన ఓ యువతి.. తనతో విడాకులు తీసుకోవాలంటూ భర్తను బెదిరిస్తోంది. విడాకులు ఇచ్చి భరణం కింద 20 లక్షలు చెల్లించాలంటూ పెద్దల ముందు పంచాయతీ పెట్టింది.

అసలు ఏం జరిగిందంటే.. గత సంవత్సరం డిసెంబర్ లో ఈ జంటకు పెళ్లి అయింది. పెళ్లి తర్వాత వీళ్లు హనీమూన్ కు ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. అక్కడ హోటల్ లో స్టే చేసిన సమయంలో బీరు తాగుతా అని భార్య భర్తను కోరింది. దానికి భర్త ఒప్పుకోలేదు. దీంతో తనకు చిర్రెత్తుకొచ్చి అక్కడే తనకు విడాకులు ఇచ్చేయాలని పేచీ పెట్టింది. ఎలాగోలా సర్దిచెప్పిన భర్త తనను గుజరాత్ తీసుకొచ్చాడు. ఇక్కడికి రాగానే తన సామాన్లు సర్దుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి.. విడాకులు ఇచ్చి.. భరణం కింద 20 లక్షల ఇవ్వాలని భర్తను బెదిరిస్తోంది. ఒకవేళ విడాకులు ఇవ్వకపోతే.. అత్త, మామ, భర్తపై తప్పుడు కేసులు పెడుతానని బెదరిస్తోందట. దీంతో ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తి తనలో తానే బాధపడిపోతున్నాడట.