నేడు తెలంగాణకు యోగీ

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం మరో మూడు రోజల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.  ఈ సందర్భంగా నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ  ఆదిత్యనాథ్ ని రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే  ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు పలు సభల్లో పాల్గొని తెరాస, ప్రజా కూటమిలపై ధ్వజమెత్తారు. దీంతో నేటి యోగీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకోనుంది. భాజపా – తెరాస మిత్ర బంధం కొనసాగతోంది అంటున్న ప్రతిపక్షాలకు యోదీ ఆదిత్య నాథ్ సభతో మరింత క్లారిటీ రానుంది.

యోగి పర్యటన షెడ్యూల్:
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు యోగీ వికారాబాద్ చేరుకుని, తాండూర్‌ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో,5 గంటలకు గోషామహాల్‌లో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆదివారం ఒకే రోజు యోగీతో పాటు అమిత్ షా, గడ్కారీలు కూడా పర్యటించనున్న నేపథ్యంలో తెలంగాణలో ఎటు చూసిన ఎన్నికల కోలాహాలం కనబడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news