అద్భుత.. అతులిత.. నటనా ఘటికా.. కథానాయకా ఫస్ట్ సాంగ్ రిలీజ్..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మొదట ఒక సినిమాగా రిలీజ్ చేయాలని అనుకున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెస్తున్నారు. మొదటి పార్ట్ కథానాయక్డు, రెండో పార్ట్ మహానయకుడు.

ఎన్.టి.ఆర్ కథనాయకుడు సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం గురించి ఘనకీర్తిసాంద్ర విజితాఖిలాంద్ర జనతా సుదీంద్ర మణిదీపకా అంటూ సాంగ్ మొదలవుతుంది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంగీతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఈ పాట వింటే తెలుస్తుంది. శివ దత్తా మరియు రామకృష్ణ కలిసి రాసిన ఈ పాటని ఖైలాష్ ఖేర్ పాడటం జరిగింది.

కథానాయకుడిగా ఎన్.టి.ఆర్ పోశించిన పాత్రలన్ని చూపించేలా ఈ సాంగ్ నడుస్తుందని తెలుస్తుంది. సినిమాకు హైలెట్ గా నిలవడమే కాదు కొన్నాళ్లుగా ఈ పాట గుర్తుండిపోయేలా లిరిక్స్, సంగీతం అందించడం జరిగింది. జనవరి 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news