ప్రియాంక చోప్రాకు పెళ్లి విషెస్ చెప్పిన అముల్ బేబీ..!

-

Amul special wishes to priyanka chopra on her marriage

నిక్యాంక.. అదేనండి.. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల పెళ్లి డిసెంబర్ 1న జోధ్ పూర్ లో క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది కదా. ఇవాళ అంటే డిసెంబర్ 2న హిందూ సంప్రదాయం ప్రకారం వాళ్ల పెళ్లి జరుగుతుంది. ఇక.. వీళ్ల పెళ్లికి బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అఫీషియల్ గా ప్రియాంక, నిక్ భార్యాభర్తలయ్యారు.

దీంతో నిక్యాంకకు శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. ఈసందర్భంగా ప్రముఖ డెయిరీ వ్యాపార సంస్థ అముల్ కూడా నిక్యాంకకు శుభాకాంక్షలు తెలిపింది. తమ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ప్రియాంక పెళ్లి గురించి ట్వీట్ చేసింది. అముల్ ఉమైద్ ఫర్ ఈచ్ అదర్ అంటూ క్యాప్సన్ పెట్టిన అముల్… అముల్ బేబీ ఎంత ఫేమసో తెలుసు కదా.. అదే తరహాలో.. వీళ్ల పెళ్లి కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన పెయింటింగ్ ను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ ట్వీట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news