గ్యాస్ సమస్యకు ఈ చిట్కాలతో చెక్ పెట్టేయొచ్చు.. కదలకుండా కుర్చున్నా కూడా సమస్యే తెలుసా..!

-

ప్రజెంట్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే అది గ్యాస్ అనే చెప్పాలి.. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి వస్తుంది. టైంకు భోజనం చేయకకోవటం, తీవ్రమైన మానసికి ఒత్తిడి, సరిగా నిద్రలేకపోవటం, ఎక్కువ ఆలోచనలు ఇవన్నీ మితిమీరి గ్యాస్ ట్రబుల్ కి దారితీస్తున్నాయి. జాబ్స్ చేసే వాళ్లకు దాదాపు ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. ఏం చేస్తాం మరి..ఆఫీస్ ప్రజర్ ఓవైపు..టార్గెట్ మరోవైపు కొన్ని సార్లు మంథ్ ఎండ్ లో అయితే తినటానికి కూడా టైం ఉండదు. ముఖ్యంగా బ్యాక్ జాబ్ చేసే వాళ్లకు మంథ్ ఎండ్ అంటే నరకమే అని చెప్పాలి. ఈరోజు మనం గ్యాస్ ట్రుబుల్ కారణాలేంటి, అసలు ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి, పరిష్కారం ఏంటో తెలుసుకుందాం.

గ్యాస్ ట్రబుల్ కు కారణాలేంటీ?

• సరైన టైంకు ఆహారం తీసుకోకపోవడం.
• కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం..
• టీ, కాఫీ అధికంగా తాగటం
• జీర్ణకోశంలో ఇన్ ఫెక్షన్లు మొదలైనవి కూడా గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణాలు..
• మానసిక ఆందోళనలు, దిగులు, కుంగుబాటుకు లోనుకావడం వంటివి కూడా కారణాలే
• ఒత్తిడి, అలసట.
• మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం.
• ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం.
• మలబద్ధకం, వివిధ వ్యాధులకు వాడే మందులు,
• మధుమేహం, ఐబీఎస్ వంటి కొన్ని వ్యాధుల వల్ల ప్రేగుల కదలికల్లో మార్పులు జరగడం,
• హార్మోన్ల అస్వవ్యస్థత తదితర కారణాలు కూడా గ్యాస్ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు.

లక్షణాలు ఏంటీ?

గ్యాస్ ట్రుబుల్ లక్షణాలు ఇలా ఉంటాయి..
• కడుపు ఉబ్బరంగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం.
• ఆహారం జీర్ణం కాక కడుపునొప్పి రావడం. మలబద్ధకం
• ఆకలి లేకపోవడం, ఛాతిలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం.
• కడుపులో మంటతో కూడిన నొప్పిరావడం.

గ్యాస్ సమస్యకు ఇలా చెక్ పెట్టిండి:

గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు టాబ్ లెట్లు వేసుకుంటూ ఉంటారు..కానీ కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను దూరంలో చేసుకోవచ్చు కూడా అవేంటో ఇప్పుడు చూద్దాం

1. వెల్లుల్లి:

గ్యాస్ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన ఔషధం అని చెప్పొచ్చు. దీనిని తిన్నగా నమిలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తమీర జీలకర్ర తీసుకుని ఐదు నిమిషాలపాటు నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

2. కొబ్బరి నీళ్లు:

గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచి మందు అని చెప్పవచ్చు.. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి రోజూ కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే ఈ సమస్య పోతుంది.

3. నిమ్మరసం:

గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఉప్పుతో నిమ్మరసం, అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఈ రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.

4. కొత్తిమీర:

అజీర్తి నిర్మూలనుకు కొత్తిమీర బాగా పనిచేస్తుందట. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒకగ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు.

5.అల్లం:

గ్యాస్ సమస్యకు చక్కటి పరిష్కారం అల్లం. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర కలుపుకోని కూడా తినొచ్చు.

6. నల్ల మిరియాలు:

మిరియాలను పాలలో కలిపి తాగితే గ్యాస్ సమస్య తీరుతుంది.

7. దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత వడగొట్టి తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.

8. ఇంగువ:

ఒక గ్లాస్ లో వేడినీటిని తీసుకుని, అందులో ఇంగువ వేసుకుని బాగా కలిపి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య, కడుపు నొప్పి, అజీర్తి
తగ్గిపోతాయి.

ఇవే కాదు..టైంకు భోజనం చేయటం, మసాలాలు, వేపుల్లు , ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినటం తగ్గించటం, నిల్వ ఉంచిన పచ్చళ్లుకూడా ఎక్కువగా తినటం మంచిదికాదు. తినే ఆహారాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని బాగా నమిలి మింగాలి. చాలా మంది ఎక్కువగా నమలకుండా మింగేస్తుంటారు. అలా చేస్తే గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది. కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, ఎక్కువగా చూయింగ్ నమలటం వల్ల కూడా గ్యాస్ సమస్య పెరుగుతుంది. కాబట్టి మీరు గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతుంటే.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే తగ్గించుకోవటానికి ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news