నగరంలోని చార్మినార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో క్రమంగా మంటలు షాప్ మొత్తం వ్యాపించడంతో.. దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంఇ సమాచారం అందించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరకున్నారు.
ఫైర్ ఇంజన్ సాయంతో దాదాపు 2 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే.. షాట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, కానీ.. ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఎంత మేరక ఆస్తి నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నామన్నారు.