బ్యాంక్ కి వెళ్లకుండానే ఆకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు..!

-

మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ బ్యాంక్ ఖాతాని ఓపెన్ చెయ్యడానికి బ్యాంక్ కి వెళ్లాల్సిన పని లేదు. కేవలం మీ ఇంట్లో వుండే ఈ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ తాజాగా కొన్ని కొత్త సేవలని తీసుకు వచ్చింది. అయితే ఈ సర్వీసుల లో భాగంగా మీరు బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళక్కర్లేకుండానే ఖాతాని ఓపెన్ చెయ్యచ్చు.

ఇది ఇలా ఉంటే ఇండియన్ బ్యాంక్ తాజాగా వీడియో కేవైసీ సేవలు అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. అయితే ఈ సేవల లో భాగంగా వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ VCIP ద్వారా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేస్తే ఫెసిలిటీని కల్పించడం జరిగింది.

బ్యాంక్ ఈ సేవల కోసం జియోమ్ బిజినెస్ సొల్యూషన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇంటి వద్దకే ఏటీఎం కార్డు, చెక్ బుక్ వంటివి కూడా వస్తాయి. వీటి కోసం మీరు బ్యాంక్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇది ఇలా ఉంటే ఇతర సర్వీసులకు కూడా వీడియో కేవైసీ సేవలను దశల వారీగా అందుబాటులోకి తీసుకు వస్తాము అని బ్యాంక్ అంది.

 

Read more RELATED
Recommended to you

Latest news