బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం తో ప్రజలు, రైతులకు కలిగిన ఉపయోగాన్ని మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది కాలేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అని విమర్శించారు. ఈ నివేదిక వల్ల బీఆర్ఎస్ వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు కాలేశ్వరంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు.
కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకున్న న్యాయ పరంగా ఎదుర్కొందామని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించిందే. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయొచ్చు. ఎవరూ భయపడొద్దు. అందరూ ధైర్యంగా ఉండండి అని కేసిఆర్ పిలుపునిచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.