హీరోయిన్ సిమ్రాన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు..!!

-

ఒకప్పుడు మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత తమిళ్, తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగి.. దాదాపు దశాబ్దానికి పైగా ఒక ఊపు ఊపిన హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేసి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సిమ్రాన్ దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా ఆడి పాడింది. తెలుగులో మహానటి సావిత్రి తర్వాత సౌందర్య ఎలాగో ఆ తర్వాత అంతటి ప్రేక్షక ఆదరణ పొందిన సిమ్రాన్ కూడా అలాగా.. అందం, అభినయంతో పాటు సూపర్ డాన్సర్ కూడా..

ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను వివాహం చేసుకున్న ఈమెకు ఇద్దరు కొడుకులు జన్మించారు. సినిమాలలో ఆశించిన స్థాయిలో ఆ తర్వాత టెలివిజన్లో కూడా అలరించిన ఈమె తమిళంలో కూడా రీ ఎంట్రీ ఇచ్చి.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. చివరిగా తెలుగులో 2008లో కృష్ణ భగవాన్ పక్కన నటించిన జాన్ అప్పారావు 40 ప్లస్ సినిమాలో చివరిసారిగా నటించింది. ఇంస్టాగ్రామ్ లో తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలన్నింటినీ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. 47 సంవత్సరాల వయసులో కూడా తన గ్లామర్ను చక్కగా మెయింటైన్ చేస్తుంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా సిమ్రాన్ పంచుకున్న తన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా 47 లో కూడా ఆమె అంతే స్లిమ్ముగా అందంగా ఉంది అంటే ఆమెకు అందంపై ఏ విధంగా శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news